నిజామాబాద్ రూరల్ శివారులోని పాల్దా గ్రామంలో ప్లాస్టిక్ బ్యాగ్ ఫ్యాక్టరీ నిర్వాహకుడు ఐపీ పెట్టి పరారయ్యాడు. ఆయన పలు బ్యాంకులు, సంస్థలతో పాటు పలువురు వ్యాపారుల నుంచి భారీ మొత్తంలో అప్పు తీసుకున్నాడు. ఈ క్రమంలో రూ. 81 కోట్లకు ఐపీ పెట్టినట్లు తెలుస్తోంది. దీంతో ఆయనకు అప్పు ఇచ్చిన వారు ఆందోళన చెందుతున్నారు.