గల్ఫ్‌లో చంద్రాయన్‌పల్లి వాసి మృతి

బతుకుదెరువుకు గల్ఫ్ వెళ్లిన వ్యక్తి అనారోగ్యంతో మృతి చెందాడు. చంద్రాయన్‌పల్లి తండాకు చెందిన మోహన్‌నాయక్‌ 12 ఏళ్లుగా సౌదీలో ఉపాధి పొందుతున్నారు. 4 నెలల కిందట స్వగ్రామం వచ్చి వెళ్లారు. వారం కిందట గదిలో కుప్పకూలడంతో ఆస్పత్రికి తరలించగా.. మెదడులో రక్తం గడ్డకట్టిందని శస్త్రచికిత్స చేశారు. కోమాలో ఉన్న మోహన్‌ ఆదివారం రాత్రి మృతిచెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. ఆయనకు భార్య, ముగ్గురు కూతుళ్లు, కుమారుడు ఉన్నారు.

సంబంధిత పోస్ట్