నిజామాబాద్: కేసీఆర్, హరీష్ రావుకు శిక్ష తప్పదు

సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని చూసి ఓర్వలేక కేటీఆర్ ఇష్టారీతిన మాట్లాడుతున్నారని నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే భూపతిరెడ్డి అన్నారు. శుక్రవారం నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ లో ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడారు. కాళేశ్వరం ప్రాజెక్టులో భారీగా అవినీతి జరిగిందని, ఇందులో ప్రధాన సూత్రధారులు కేసీఆర్, హరీష్ రావు లేనని స్పష్టం చేశారు. జ్యూడిషల్ విచారణ ఎదుర్కొంటున్న కేసీఆర్, హరీష్ రావులకు శిక్ష తప్పదని జోస్యం చెప్పారు.

సంబంధిత పోస్ట్