నిజామాబాద్ లో ఉరి వేసుకుని ఒకరు మృతి

నిజామాబాద్ నగరంలోని ప్రభుత్వ జనరల్​ ఆస్పత్రి ఆవరణలో జుక్కల్ మండలంలోని మహమ్మదాబాద్ గ్రామానికి చెందిన పొనుగంటి సాయిలు(37) ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నట్లు ఎస్ హెచ్ వో రఘుపతి తెలిపారు. మృతుని భార్య సంగీత ఈ నెల 6న జీజీహెచ్ లో ఆనార్యోగంతో చేరిందన్నారు. సంగీతకు చికిత్స చేస్తున్న సమయంలో రక్తం ఎక్కించినట్లు చెప్పారు. భార్య ఆస్పత్రిలో ఉండగా డబ్బులు లేకపోవడం అలాగే అప్పులు ఎలా తీర్చాలో తెలియక మద్యానికి బానిసై ఆత్మహత్య చేసుకున్నట్లు చెప్పారు.

సంబంధిత పోస్ట్