కామారెడ్డిలో దొంగ హల్చల్

కామారెడ్డి జిల్లా తాడ్వాయి మండలంలోని ఎండ్రియల్ గ్రామంలో తెల్లవారుజామున చైన్ స్నాచింగ్ కలకలం రేగింది. గ్రామ పంచాయతీ భవనం, పాల కేంద్రం మధ్య నివాస ప్రాంతంలో వాకిలి ఊడుస్తున్న మహిళ మెడలోని మూడు తులాల బంగారు పుస్తెలతాడును దొంగ తెంచుకుని పరారయ్యాడు. దొంగ ముఖానికి బట్ట కట్టుకుని, సీసీ కెమెరాల్లో చిక్కకుండా అత్యంత చాకచక్యంగా వ్యవహరించాడు. బాధితురాలు కేకలు వేయడంతో గ్రామస్తులు అప్రమత్తమయ్యేలోపే నిందితుడు తప్పించుకున్నాడు.

సంబంధిత పోస్ట్