కాలభైరవ స్వామి ఆలయ అభివృద్ధికి 10 కోట్లు మంజూరు చేయిస్తా

దక్షిణ కాశీగా పేరుగాంచిన కాలభైరవ స్వామి ఆలయ అభివృద్ధికి 10 కోట్ల రూపాయల నిధులు మంజూరు చేయించి, అభివృద్ధి పనులు చేపడతామని ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు తెలిపారు. శనివారం కాలభైరవ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం ఆయన భక్తులతో మాట్లాడారు. ప్రాచీన, మహిమాన్విత చరిత్ర కలిగిన ఈ ఆలయ అభివృద్ధికి భక్తులు తమకు తోచిన విధంగా ఆర్థిక సహాయం అందించాలని సూచించారు. నూతన పాలకవర్గ సభ్యులు ఆలయ అభివృద్ధికి శక్తివంచన లేకుండా కృషి చేయాలని కోరారు.

సంబంధిత పోస్ట్