నాగిరెడ్డిపేట మండల కేంద్రంలోని ఆదర్శ పాఠశాల ప్రిన్సిపల్ రాంప్రసాద్ తెలిపిన వివరాల ప్రకారం, ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షల్లో పాఠశాల 100% ఉత్తీర్ణత సాధించింది. ఇంటర్ రెండవ సంవత్సరంలో పరీక్షలు రాసిన 16 మంది విద్యార్థులు అందరూ ఉత్తీర్ణులయ్యారు. మొదటి సంవత్సరంలో 68 మంది పరీక్షలు రాయగా, 62 మంది ఉత్తీర్ణత సాధించి 91% ఉత్తీర్ణత నమోదైంది.