మేళాలో 15 మంది విద్యార్థుల ఎంపిక

ఎల్లారెడ్డి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో బుధవారం విజయ బయోఫెర్టిలైజర్స్, టీఎస్కెసి ఆధ్వర్యంలో నిర్వహించిన జాబ్ మేళాలో 15 మంది విద్యార్థులు ఉద్యోగాలకు ఎంపికయ్యారు. ఎంపికైన అభ్యర్థులకు ఆ సంస్థ హెచ్ ఆర్ మేనేజర్ డి. నరేష్ నియామక పత్రాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఇ లక్ష్మీనారాయణ, టీఎస్కెసి కోఆర్డినేటర్ జే. శివకుమార్, వైస్ ప్రిన్సిపాల్ చంద్రకాంత్, ఐక్విఏసి కో- ఆర్డినేటర్ శంకరయ్య, టీఎస్కెసి మెంటార్ రాజు, ఇతర అధ్యాపకులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్