కామారెడ్డి జిల్లాలోని ఉమ్మడి జిల్లాల రైతుల రబీ పంటలకు ప్రాజెక్టు ప్రధాన కాల్వ ద్వారా 5వ విడత సాగునీటిని విడుదల చేసినట్లు ప్రాజెక్టు ఏఈ సాకేత్ తెలిపారు. శనివారం ఉదయం నుండి 1500 క్యూసెక్కుల నీరు ఆయకట్టు రైతులకు అందుతున్నాయని, నీటిని పొదుపుగా వాడుకోవాలని సూచించారు. ప్రాజెక్టు జలాశయం 1405 అడుగులు కాగా, ప్రస్తుతం 1398.94 అడుగుల నీరు నిల్వ ఉంది.