కామారెడ్డి మున్సిపాలిటీ పరిధిలోని వడ్లూర్ గ్రామ శివారులో మంగళవారం విషాదం చోటు చేసుకుంది. కామారెడ్డి నుంచి నిజామాబాద్ వైపు వెళ్తున్న ట్రాక్ చెకింగ్ రైలు ఢీకొనడంతో ఇల్చిపూర్ గ్రామానికి చెందిన కురుమ లక్ష్మి, కుమార్‌లకు చెందిన 19 గొర్రెలు అక్కడికక్కడే మృతి చెందాయి. ఈ ఘటనతో గొర్రెల యజమానులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. నష్టపరిహారం అందించాలని వారు అధికారులను కోరారు.