ఎల్లారెడ్డిలో రెండో రోజు 24 నామినేషన్లు దాఖలు

గురువారం ఎల్లారెడ్డి మున్సిపాలిటీలో మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో రెండో రోజు 24 నామినేషన్లు దాఖలయ్యాయని మున్సిపల్ కమిషనర్ మహేష్ కుమార్ తెలిపారు. ఉదయం 10:30 నుంచి సాయంత్రం 5:00 గంటల వరకు 12 వార్డులకు గాను వివిధ పార్టీల అభ్యర్థులు నామినేషన్లు సమర్పించారు. వార్డుల వారీగా నామినేషన్ల వివరాలు ఇలా ఉన్నాయి: 1వ వార్డులో 2, 2వ వార్డులో 1, 3వ వార్డులో 2, 4వ వార్డులో 3, 5వ వార్డులో 4, 7వ వార్డులో 2, 8వ వార్డులో 1, 9వ వార్డులో 4, 10వ వార్డులో 3, 12వ వార్డులో 2 నామినేషన్లు స్వీకరించారు. 6వ, 11వ వార్డులలో ఎటువంటి నామినేషన్లు దాఖలు కాలేదు.

సంబంధిత పోస్ట్