కామారెడ్డి జిల్లా కేంద్రంలోని సైలాన్ బాబా కాలనీలో మహమ్మద్ వహీద్ తన బంధువుల ఇంటికి సిద్దిపేట వెళ్లి తిరిగి వచ్చేసరికి, గుర్తుతెలియని దుండగులు ఇంటి తాళాలను పగులగొట్టి 7 తులాల బంగారం, 80 తులాల వెండి వస్తువులను దొంగిలించారు. బాధితుడు పోలీసులకు సమాచారం అందించగా, సంఘటనా స్థలానికి చేరుకున్న క్లూస్ టీం సిబ్బంది వేలిముద్రలను సేకరించారు. బాధితుడు వహీద్ మాట్లాడుతూ, తమ ఇంటి తాళాలు పగలగొట్టి, గ్యాస్ సిలిండర్ రెగ్యులేటర్ ను తెరిచి వెళ్లారని వాపోయారు.