ఎల్లారెడ్డి మండలంలో 84. 2 శాతం పల్స్ పోలియో నమోదు

ఎల్లారెడ్డి మున్సిపల్ పరిధి, 3 గ్రామ పంచాయతీలలో బుధవారం 0-5 ఏళ్ల చిన్నారులకు చుక్కల మందు పంపిణీ జరిగింది. డిప్యూటీ డిఎంఅండ్హెచ్ఓ డాక్టర్ నర్సింగ్ చౌహాన్ తెలిపిన వివరాల ప్రకారం, 4,425 మంది చిన్నారులకు పోలియో చుక్కలు వేయాలని లక్ష్యంగా పెట్టుకోగా, 84.2 శాతం మందికి (3,726 మందికి) చుక్కల మందు వేశారు. ఇందులో బూత్ ల వారీగా 3,504 మంది, ట్రాన్సిట్ ద్వారా 158 మంది, మొబైల్ పాయింట్స్ ద్వారా 65 మంది చిన్నారులు ఉన్నారు.

సంబంధిత పోస్ట్