సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ కు నివాళులు అర్పించిన గడ్డం

కామారెడ్డి పట్టణంలో గురువారం సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ వర్ధంతి సందర్భంగా, టిపిసిసి స్టేట్ జనరల్ సెక్రెటరీ గడ్డం చంద్రశేఖర్ రెడ్డి ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. గడ్డం చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ, సర్వాయి పాపన్న గౌడ్ తెలంగాణ గడ్డపై తొలి బహుజన చక్రవర్తి అని, అణగారిన వర్గాల ఆత్మగౌరవ పోరాటానికి నిరంతరం ప్రేరణగా నిలిచిన నాయకుడని, నిరంకుశ రాచరికాలకు వ్యతిరేకంగా పోరాడిన యోధుడని కొనియాడారు. ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రెటరీలు జూలూరి సుధాకర్, జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు పంపరి లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్