కామారెడ్డిలో కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి సందర్భంగా ఆయన విగ్రహానికి అదనపు కలెక్టర్ ఎన్. వై. గిరి పూలమాల వేసి ఆదివారం నివాళులర్పించారు. తెలంగాణ సాధన, ప్రజల హక్కుల పరిరక్షణ కోసం బాపూజీ చేసిన సేవలు చిరస్మరణీయమని, ఆయన ఆశయాలు నేటి తరానికి స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ ఇప్ప ఉమారాణి శ్రీనివాస్, గ్రంథాలయ చైర్మన్ మద్ది చంద్రకాంత్ రెడ్డి, ప్రజాప్రతినిధులు, అధికారులు, వివిధ సంఘాల నాయకులు పాల్గొన్నారు.