ఎల్లారెడ్డి డివిజన్ కేంద్రంలోని శ్రీశ్రీశ్రీ ధర్మశాస్త్ర అయ్యప్ప ఆలయంలో బుధవారం స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. పూజల అనంతరం, పట్టణ ప్రముఖ పారిశ్రామికవేత్త ముత్యపు వీరేశ లింగం ఆధ్వర్యంలో అయ్యప్ప స్వామికి అన్నప్రసాద నైవేద్యం, భిక్ష ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా పేదలకు కూడా అన్నదానం నిర్వహించారు. అయ్యప్పలకు భిక్ష (అన్నప్రసాదం) ఏర్పాటు చేసి, స్వాములకు పండ్లు అందించి, స్వామి పాదాలకు నమస్కరించి ఆశీర్వాదం పొందారు.