కామారెడ్డి జిల్లా కేంద్రం సమీపంలోని పెద్ద చెరువులో చేపలు పట్టడానికి వెళ్లిన బోడదారి స్వామి (25) అనే యువకుడు బుధవారం సాయంత్రం వలలో చిక్కుకొని మృతి చెందాడు. గురువారం ఉదయం పోలీసులు మృతదేహాన్ని వెలికితీసి, కేసు నమోదు చేసి పోస్ట్ మార్టం నిమిత్తం తరలించారు. సరంపల్లి గ్రామానికి చెందిన స్వామి మృతితో కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.