కామారెడ్డి జిల్లా కోర్టు మైనర్ బాలికపై లైంగిక దాడికి పాల్పడిన నిందితుడికి జీవిత ఖైదుతో పాటు రూ. 50,000 జరిమానా విధించింది. మంగళవారం ఈ తీర్పు వెలువడింది. దేవునిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదైన పోక్సో కేసులో, అదే కాలేజీలో చదివే తోకల రాజశేఖర్ అనే వ్యక్తి బాలికను వేధించి, బలవంతంగా లైంగిక దాడికి పాల్పడినట్లు ఫిర్యాదు నమోదైంది. సాక్ష్యాధారాలను పరిశీలించిన అనంతరం న్యాయమూర్తి ఈ శిక్ష విధించారు.