అక్రమ కట్టడాలపై చర్యలు తీసుకోవాలి...బీజేపీ కౌన్సిలర్లు

కామారెడ్డి పట్టణంలో నిబంధనలకు విరుద్ధంగా  సెల్లార్, పార్కింగ్ సదుపాయాలు లేకుండా నాలాలపై నిర్మిస్తున్న అక్రమ కట్టడాలపై చర్యలు తీసుకోవాలని కోరుతూ బీజేపీ కౌన్సిలర్లు బుధవారం కామారెడ్డి మున్సిపల్ కార్యాలయంలో కమిషనర్ ను కలిసి వినతి పత్రం సమర్పించారు. కొందరు అధికారులు చేతివాటం చూపి అక్రమ నిర్మాణాలకు సహకరిస్తున్నారని ఆరోపించారు. ఈ విషయంలో విచారణ చేపట్టి కఠిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు.

సంబంధిత పోస్ట్