ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు గురువారం కామారెడ్డి జిల్లా సివిల్ సప్లై అధికారులతో ధాన్యం కొనుగోలు, తరలింపు సమస్యపై చర్చించారు. రైతులు, లారీ డ్రైవర్లు, కార్మికులు ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో, ఒకే రైస్ మిల్లుకు ధాన్యం కేటాయించడం వల్ల తీవ్ర రద్దీ ఏర్పడి లారీలు రోజుల తరబడి వేచి ఉండాల్సి వస్తోందని ఆయన పేర్కొన్నారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ధాన్యం కొనుగోలు ప్రక్రియ సజావుగా కొనసాగేందుకు మరికొన్ని రైస్ మిల్లులకు ధాన్యం కేటాయించాలని అధికారులను ఎమ్మెల్యే ఆదేశించారు.