గుర్తుతెలియని మృతదేహం లభ్యం

కామారెడ్డి జిల్లా నిజాంసాగర్ మండలం నరసింగరావుపల్లి గ్రామ శివారులో 161 జాతీయ రహదారి కల్వర్టు క్రింది భాగంలో గుర్తుతెలియని మృతదేహం లభ్యమైనట్లు నిజాంసాగర్ ఎస్సై సుధాకర్ తెలిపారు. మృతదేహం పై తెలుపు రంగు చొక్కా, ధోవతి ధరించి ఉన్నాడని, మృతుని వయసు సుమారు 45 నుండి 50 సంవత్సరాలు ఉంటుందని ఎవరైనా తప్పిపోయి ఉంటే నిజాంసాగర్ పోలీస్ స్టేషన్ లో సంప్రదించాలన్నారు. సంఘటనా స్థలాన్ని బాన్సువాడ రూరల్ సీఐ పరిశీలించారు.

సంబంధిత పోస్ట్