రామారెడ్డి మండలం అన్నారం గ్రామానికి చెందిన వంచ అంజల్ రెడ్డి, ఎన్నో ఉద్యోగావకాశాలున్నా తనకిష్టమైన ఉపాధ్యాయ వృత్తినే ఎంచుకున్నారు. ప్రాథమిక విద్య అన్నారంలో, ఉన్నత విద్య రెడ్డిపేటలో, ఇంటర్మీడియట్, డిగ్రీ కామారెడ్డి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో పూర్తి చేశారు. లింగంపేట్ మండలంలో ఉపాధ్యాయునిగా పనిచేస్తూ, ఇంచార్జీ ఎంఈఓగా బాధ్యతలు స్వీకరించారు. ఎంత ఎదిగినా ఒదిగి ఉండే మనస్తత్వంతో ఆయన ముందుకు సాగుతున్నారు, ఎందరి మన్ననలనూ పొందుతున్నారు.