ఈ నెల 11వ తేదీన ఎల్లారెడ్డిలోని ముద్రకోల సత్యంకి చెందిన కిరాణా షాప్ పైన గల గోదాములోని షట్టర్ తాళాలు పగలగొట్టి లోపల ఉన్న కిరాణా వస్తువులను దొంగతనం చేసిన కేసులో నిందితుడు బిక్కనూర్ కు చెందిన కోడెనోళ్ల రాజు ను శనివారం అరెస్ట్ చేసినట్లు ఎస్ఐ. బొజ్జ మహేష్ తెలిపారు. నిందితుడి వద్ద నుండి దొంగతనానికి సంబంధించిన వస్తువులు స్వాధీనం చేసుకుని, అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్లు ఎస్‌ఐ. తెలిపారు.