ఎల్లారెడ్డి ఎమ్యెల్యే కార్యాలయంలో శుక్రవారం సీఐటీయు ఆధ్వర్యంలో ఎల్లారెడ్డి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కురుమ సాయిబాబాకు ఆశావర్కర్లు వినతి పత్రం సమర్పించారు. ఆశాల సమస్యలను ఎమ్యెల్యే ద్వారా సీఎం రేవంత్ రెడ్డికి అందజేయాలని కోరారు. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో ఫిక్సిడ్ వేతనం 18, 000 రూపాయల ప్రకటనతో పాటు ఇతర సమస్యలు రాష్ట్ర ప్రభుత్వం పరిష్కరించే విధంగా చూడాలని కోరారు.