ఆశా వర్కర్లకు నెలకు 18వేల ఫిక్స్డ్ వేతనం ఇవ్వాలి

ఎల్లారెడ్డి మండల ఆశావర్కర్లు, అధ్యక్షురాలు మంజుల ఆధ్వర్యంలో మంగళవారం మత్తమాల పీహెచ్‌సీ వైద్యాధికారి డాక్టర్ శరత్‌కు వినతిపత్రం అందించారు. రాష్ట్రవ్యాప్తంగా సుమారు 28 వేల మంది ఆశావర్కర్లు గత 20 ఏళ్లుగా గ్రామాల్లో రిజిస్టర్లు రాయడం, సర్వేలు చేయడం, బీపీ, షుగర్, థైరాయిడ్ వంటి పరీక్షలు నిర్వహించడం, ప్రభుత్వ మందులను సరఫరా చేయడం వంటి అనేక పనులు చేస్తున్నప్పటికీ, నెలకు కేవలం 7 వేల రూపాయలు మాత్రమే వేతనంగా పొందుతున్నారని, దీనిని 18 వేల రూపాయలకు పెంచాలని వారు డిమాండ్ చేశారు.

సంబంధిత పోస్ట్