నిర్మల్ పట్టణానికి చెందిన ప్రముఖ వైద్యులు డాక్టర్ సంతోష్ కుమార్ గుప్తాపై భౌతిక దాడి జరిగిన ఘటనను కామారెడ్డి మాజీ మున్సిపల్ చైర్మన్, సీనియర్ కాంగ్రెస్ నేత కైలాస్ శ్రీనివాస్ గుప్తా తీవ్రంగా ఖండించారు. శనివారం ఆయన మాట్లాడుతూ, సమాజానికి సేవ చేసే వైద్యులపై ఇలాంటి దాడులు జరగడం ప్రజాస్వామ్యానికి ఆందోళనకరమని అన్నారు. డాక్టర్ సంతోష్ కుమార్ పై అకారణంగా దాడి చేసి, అసభ్య పదజాలంతో దుశించిన నిందితులను వెంటనే అరెస్ట్ చేయాలని ఆయన డిమాండ్ చేశారు.