పేకాట శిబిరంపై దాడి... ఐదుగురి అరెస్టు

ఎల్లారెడ్డి సెగ్మెంట్ రామారెడ్డి మండలం ఉప్పల్వాయిలో పేకాట స్థావరంపై పోలీసులు శనివారం రాత్రి దాడి నిర్వహించారు. గ్రామంలోని ఓ ఇంట్లో పేకాట నిర్వహిస్తున్నారన్న సమాచారంతో ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. ఈ ఘటనలో ఐదుగురిని అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి రూ. 21,930 నగదు, 5 మొబైల్ ఫోన్లు, 2 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. ఎక్కడైనా పేకాట ఆడితే సమాచారం ఇవ్వాలని, సమాచారం ఇచ్చిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని ఎస్ఐ. రాజశేఖర్ తెలిపారు.

సంబంధిత పోస్ట్