ఎల్లారెడ్డి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో సోమవారం అకడమిక్ ఆడిట్ నిర్వహించారు. బిచ్కుంద ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ అశోక్, గిరిరాజ్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల సీనియర్ ఫ్యాకల్టీ చంద్రశేఖర్ ఈ ఆడిటింగ్‌లో పాల్గొన్నారు. వారి ఆధ్వర్యంలో 2022–23, 2023–24 విద్యా సంవత్సరాలకు సంబంధించిన కళాశాలలోని అన్ని విభాగాల ఆడిటింగ్ పూర్తయినట్లు కళాశాల ప్రిన్సిపల్ ఈ లక్ష్మీనారాయణ తెలిపారు.