అయ్యప్ప - శివస్వాములకు బిక్ష ఏర్పాటు

ఎల్లారెడ్డి పట్టణంలోని శ్రీశ్రీశ్రీ హరి హర పుత్ర ధర్మశాస్త్ర అయ్యప్ప స్వామి ఆలయం వద్ద, గురువారం మాలధారణ చేసిన అయ్యప్ప స్వాములకు, శివమాలధారణ స్వాములకు బిక్ష ఏర్పాటు చేశారు. స్థానిక అయ్యప్ప భక్తురాలు ప్రసన్న మనువడు అగస్త్య పుట్టినరోజు సందర్భంగా ఈ బిక్ష ఏర్పాటు చేయబడింది. ఆలయ పూజారి ముత్యాల శ్రీనివాస్ రావు పంతులు ప్రత్యేక పూజలు నిర్వహించి, స్వాములకు నైవేద్యం సమర్పించిన అనంతరం బిక్ష అందించారు. బిక్ష దాతను ఆలయ కమిటీ సత్కరించింది.

సంబంధిత పోస్ట్