ఎల్లారెడ్డి మండల కేంద్రంలోని బీసీ కాలనీ వెంచర్ లో బాల గణేష్ మండలి సభ్యుల ఆధ్వర్యంలో కొలువుదీరిన గణనాధుని నిమజ్జన శోభాయాత్ర గురువారం రాత్రి సాంప్రదాయ నృత్యాలు, కోలాటాలు, దాండియా ఆటపాటలతో సందడిగా సాగింది. చిన్నారులు, మహిళలు, మండలి సభ్యులు ఉత్సాహంగా పాల్గొన్న ఈ వేడుకలు ఎల్లారెడ్డిలోని ప్రధాన వీధుల గుండా సాగి, శుక్రవారం ఉదయం 4 గంటలకు మినీ ట్యాంక్ బండ్ చెరువులో గణనాధుని నిమజ్జనంతో ఘనంగా ముగిశాయి. బాల గణేష్ మండలి సభ్యులు, చిన్నారులు, యువకులు ఈ నిమజ్జన వేడుకల్లో భక్తిశ్రద్ధలతో పాల్గొన్నారు.