బడుగు బలహీవర్గాల ఆశాజ్యోతి బాపూజీ

బడుగు బలహీన వర్గాల కోసం నిరంతరం శ్రమించిన ఆశాజ్యోతి కొండా లక్ష్మణ్ బాపూజీ అని, ఎల్లారెడ్డి పట్టణ పద్మశాలి సంఘం అధ్యక్షులు విద్య రవి కుమార్ నేత అన్నారు. శనివారం ఎల్లారెడ్డి పద్మశాలి సంఘం భవనంలో పట్టణ అధ్యక్షుల అధ్యక్షతన కొండా లక్ష్మణ్ బాపూజీ 110వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్య రవి కుమార్ బాపూజీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో మండల పద్మశాలి సంఘం నేతలు పద్మ పండరి నేత, ప్రభు లింగం, దేవసాని పోషెట్టి నేత, కాశీరాం నేత, బాలకిషన్ నేత పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్