ఎల్లారెడ్డి డివిజన్ కేంద్రంలో గురువారం ఉదయం 45నిముషాల పాటు ఏకాదాటిగా కురిసిన భారీ వర్షానికి బీసీ కాలనీ నీటి కుంటగా మారింది. ఎల్లారెడ్డి పట్టణంలోని నీరంతా ఇక్కడ చేరుకొని నిలిచిపోయి కాలనీవాసులు వర్షంపడిన ప్రతిసారి బయటకు వెళ్ళని దుస్థితి ఉందని వాపోతున్నారు. ఇక్కడ నీరు నిలువకుండా పెద్దక్ మురికి కాల్వను నిర్మిస్తే సమస్య తీరుతుందని కాలనీవాసులు అంటున్నారు.