ఎల్లారెడ్డి మోడల్ స్కూల్లో బుధవారం సైబర్ క్రైమ్ పై అవగాహన కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ఎస్ఐ మహేష్ మాట్లాడుతూ, గుర్తు తెలియని వ్యక్తులు సెల్ టవర్ ఏర్పాటు చేస్తామని, ఆన్‌లైన్ పెట్టుబడులపై అధిక లాభాలు వస్తాయని చెప్పి మోసాలకు పాల్పడుతున్నారని తెలిపారు. అలాంటి కాల్స్ వచ్చినప్పుడు అప్రమత్తంగా ఉండాలని, ఓటీపీ వివరాలు ఎట్టి పరిస్థితుల్లోనూ చెప్పకూడదని సూచించారు. ప్రజలు సైబర్ నేరస్థుల పట్ల అప్రమత్తంగా ఉండాలని ఆయన కోరారు.