సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలి

జిల్లా పోలీసు కళాబృందం సభ్యులు, ఎల్లారెడ్డి పట్టణంలోని స్థానిక మోడల్ స్కూల్/కళాశాలలో సోమవారం సైబర్ నేరాలపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. జిల్లా ఎస్పీ ఎం. రాజేష్ చంద్ర ఐపీఎస్ ఆదేశాల మేరకు, స్థానిక ఎస్ఐ బొజ్జ మహేష్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో, పోలీస్ కళా బృందం ఇంచార్జి హెడ్ కానిస్టేబుల్ రామంచ తిరుపతి, హెడ్ కానిస్టేబుల్ యు. శేషారావు, సైబర్ నేరాలు, బాల్యవివాహాలు వంటి అంశాలపై విద్యార్థులకు వివరించారు. ఆధునిక సమాజంలో ప్రతి ఒక్కరూ సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్