స్మార్ట్ రేషన్ కార్డులతో పథకాల లబ్ధి సులభం.. కౌన్సిలర్ సిద్ది శ్రీధర్

కామారెడ్డి జిల్లా, ఎల్లారెడ్డిలో 8వ వార్డు కౌన్సిలర్ సిద్ది శ్రీధర్ మాట్లాడుతూ స్మార్ట్ రేషన్ కార్డుల ద్వారా అర్హులైన లబ్ధిదారులకు ప్రభుత్వ పథకాల ప్రయోజనాలు మరింత సులభంగా అందుతాయని తెలిపారు. గురువారం 8వ వార్డులో లబ్ధిదారులకు డిజిటల్ స్మార్ట్ రేషన్ కార్డులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో DCC ఉపాధ్యక్షుడు విద్యాసాగర్, 9వ వార్డు కౌన్సిలర్ గాదె తిరుపతి, వార్డు ప్రజలు పాల్గొన్నారు. స్మార్ట్ రేషన్ కార్డులతో పథకాల ప్రయోజనాలు సులభతరం అవుతాయని ఆయన పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్

✕
✕