ఎల్లారెడ్డి మున్సిపాల్ లో బీజేపీ జెండా ఎగరడం ఖాయం: మాజీ ఎంపీ

ఎల్లారెడ్డి మున్సిపాలిటీపై భారతీయ జనతా పార్టీ జెండా ఎగరడం ఖాయమని జహీరాబాద్ మాజీ ఎంపీ బీబీ పాటిల్ అన్నారు. శుక్రవారం ఎల్లారెడ్డి మున్సిపల్ కౌన్సిలర్ బీజేపీ అభ్యర్థులకు మద్దతుగా జరిగిన నామినేషన్ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, ఎల్లారెడ్డిలోని 12 వార్డుల్లో బీజేపీ అభ్యర్థుల గెలుపు కోసం ప్రతి కార్యకర్త కృషి చేయాలని కోరారు. నరేంద్ర మోడీ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించి ఓట్లు అడగాలని సూచించారు.

సంబంధిత పోస్ట్