7వ వార్డులో ప్రచారంలో బీజేపీ రాష్ట్ర నేత పైడి

ఎల్లారెడ్డి మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భారతీయ జనతా పార్టీ 7వ వార్డు కౌన్సిలర్ అభ్యర్థి మంగలి శిరీష తరపున ప్రముఖ జపాన్ శాస్త్రవేత్త, బీజేపీ రాష్ట్ర నాయకుడు డా. పైడి ఎల్లారెడ్డి ప్రచారం నిర్వహించారు. ఆయన వార్డులో గడప గడపకు తిరుగుతూ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి పనులను వివరిస్తూ, బీజేపీకి ఓటు వేయాలని ప్రజలను కోరారు. ఈ కార్యక్రమంలో స్థానిక బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఎన్నికల పోరు రసవత్తరంగా సాగుతోంది.

సంబంధిత పోస్ట్