ఓటర్ జాబితా సవరణలో గ్రామస్తులకు BLOల సహాయం

కామారెడ్డి జిల్లా, ఎల్లారెడ్డి నియోజకవర్గం, నాగిరెడ్డిపేట్ మండలం, జలాల్ పూర్ గ్రామంలో 2026 ప్రత్యేక సమగ్ర ఓటర్ జాబితా సవరణ (SIR) ప్రక్రియలో భాగంగా, ఆదివారం సెలవు దినాన కూడా గ్రామ BLOలు బానోత్ అనూష (JPO), మేడికుంది మల్లేశం (VOA)లు గ్రామ పంచాయతీ వద్ద ప్రజలకు సర్ అప్లికేషన్ ఫామ్ లను నింపడంలో సహాయం చేస్తున్నారు. అర్హులైన ప్రతి ఒక్కరూ తమ వివరాలను ఓటర్ జాబితా సవరణ ప్రక్రియలో నమోదు చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మైనార్టీ అధ్యక్షుడు కుతుబుద్దిన్, 1వ వార్డ్ సభ్యుడు జాకీర్, గ్రామస్తులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్