కామారెడ్డి జిల్లా భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో సోమవారం జరిగిన జిల్లా ముఖ్య సమావేశంలో బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు జయశ్రీ మాట్లాడుతూ, జనాభా గణనలో బూత్ కమిటీలు చురుకుగా పని చేయాలని సూచించారు. ఈ సమావేశంలో పార్టీకి సంబంధించిన పలు కీలక అంశాలపై చర్చించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర బీజేపీ కార్యవర్గ సభ్యుడు మర్రి బాలకిషన్, జిల్లా జనరల్ సెక్రెటరీ రవీందర్ రావు, జిల్లా ఉపాధ్యక్షులు దేవేందర్, మరియు ఇతర ముఖ్య నాయకులు పాల్గొన్నారు.