నాగిరెడ్డిపేటలో బీఆర్ఎస్ ఆందోళన విజయవంతం

తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర రావుకు సిట్ ఇచ్చిన నోటీసులను వెంటనే వెనక్కి తీసుకోవాలని బీఆర్ఎస్ పార్టీ ఆదివారం నాగిరెడ్డి పేట్ మండల కేంద్రంలో ముఖ్యమంత్రి దిష్టిబొమ్మను ప్రదర్శించి నిరసన తెలిపింది. రోడ్డుపై బైఠాయించి రాస్తారోకో చేపట్టారు. పోలీసులు జోక్యం చేసుకుని ఆందోళనకారులను సముదాయించి, నిరసనను విరమింపజేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ అధ్యక్షులు గుర్రాల సిద్దయ్య, మాజీ పిఎసిఎస్ చైర్మన్ రాజిరెడ్డి, సర్పంచులు వంశీకృష్ణ గౌడ్, మహేందర్, నారాయణ, సాయిలు, నాయకులు నారాయణ, శ్రీనివాస్ గౌడ్, హనుమంత్ రెడ్డి, సాయిలు, మల్లేష్, కిషన్ మహేందర్, మరియు ఇతర ముఖ్యనేతలు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్