ఎల్లారెడ్డి మున్సిపల్ 11వ వార్డు ఏకైక బీఆర్ఎస్ కౌన్సిలర్ రామగాళ్ల లక్ష్మి శివానంది, పదేళ్లుగా బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో వార్డులో అభివృద్ధి జరగలేదని ఆరోపిస్తూ పార్టీకి రాజీనామా చేశారు. మంగళవారం మున్సిపల్ చైర్మన్ పద్మ శ్రీకాంత్, ఎమ్మెల్యే మదన్ మోహన్ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. వార్డు అభివృద్ధి కోసం ఎమ్మెల్యే మదన్ మోహన్ వెంట ఉంటానని ఆమె తెలిపారు.