డబుల్ బెడ్‌రూమ్ పేరుతో బీఆర్ఎస్ పేదలకు అన్యాయం చేసింది

గత బీఆర్ఎస్ ప్రభుత్వం డబుల్ బెడ్‌రూమ్ ఇండ్ల పేరుతో నిరుపేదలకు అన్యాయం చేసిందని కామారెడ్డి జిల్లా జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మికాంత రావు ఆరోపించారు. శుక్రవారం పెద్ద కొడప్గల్ మండల కేంద్రంలో జరిగిన కార్యక్రమంలో ఆయన డబుల్ బెడ్‌రూమ్ ఇండ్ల పట్టాలు, సీఎంఆర్ఎఫ్ చెక్కులను లబ్ధిదారులకు పంపిణీ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అర్హులకు పారదర్శకంగా ఇందిరమ్మ ఇండ్లను నిర్మిస్తూ పేదలను ఆదుకుంటుందని ఎమ్మెల్యే తెలిపారు.

సంబంధిత పోస్ట్