తెలంగాణలో బీఆర్ఎస్ ఖేల్ ఖతం”: టీపీసీసీ చీఫ్

తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ పనైపోయిందని, బీజేపీకి రాష్ట్రంలో వచ్చే అవకాశమే లేదని టీపీసీసీ అధ్యక్షుడు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ వ్యాఖ్యానించారు. కామారెడ్డిలోని క్రిస్టల్ ప్యాలెస్‌లో జరిగిన డీసీసీ నూతన కమిటీ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో పాల్గొన్న ఆయన జ్యోతి వెలిగించి సమావేశాన్ని ప్రారంభించారు. నూతనంగా నియమితులైన కమిటీ సభ్యులు, మండల కాంగ్రెస్ అధ్యక్షులకు నియామక పత్రాలు అందజేసి ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీలో చిన్న పదవి అయినా భవిష్యత్తుకు పునాదిగా నిలుస్తుందని, పదవికి న్యాయం చేస్తేనే రాజకీయ భవిష్యత్ ఉంటుందన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్