ఎల్లారెడ్డి పురపాలక ఎన్నికల ప్రచారానికి మరో 5 రోజులు మాత్రమే మిగిలి ఉండటంతో, అన్ని పార్టీల అభ్యర్థులు హోరాహోరీగా ప్రచారం చేస్తున్నారు. పట్టణంలోని 2వ వార్డు నుంచి బీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న పద్మ, తోటి మహిళలు, బీఆర్ఎస్ కార్యకర్తలతో కలిసి ఇంటింటికీ వెళ్లి ఓటర్లను ఆకట్టుకుంటున్నారు. వార్డు అభివృద్ధికి తాను చేయబోయే కృషిని వివరిస్తూ, తనకు ఓటు వేసి గెలిపించాలని కోరుతున్నారు. సీనియర్ పాత్రికేయుడు మహేష్ తల్లి అయిన పద్మను గెలిపించేందుకు ఆమె తనయుడు విశ్వప్రయత్నాలు చేస్తూ ప్రచారంలో చురుగ్గా పాల్గొంటున్నారు.