నాగిరెడ్డిపేట మాజీ జెడ్పిటిసి ఉమ్మన్న గారి మనోహర్ రెడ్డి బుధవారం జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ప్రచారంలో మాట్లాడుతూ, బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి మాగంటి సునీత గెలుపు ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. ప్రజల గుండెల్లో బీఆర్ఎస్ పార్టీ పదిలంగా ఉందని, ఉచిత హామీలతో ప్రజలను మోసం చేసిన కాంగ్రెస్ పార్టీని ప్రజలు నమ్మరని ఆయన అన్నారు. కాంగ్రెస్ పాలనలో రాష్ట్రం వెనుకబడి, ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు.