బిసి కాలనిలో మురికి కాల్వలు నిర్మించండి

ఎల్లారెడ్డి పట్టణంలోని బిసి కాలనిలో మురికి కాల్వలు సరిగా లేక చిన్నపాటి వర్షానికి మురికి నీరు అంత ఆ ప్రాంతంలో నివసించే ప్రజల ఇంటి ముందు నిలవడమే కాకుండా, కాస్త భారీ వర్షం పడితే మురికి నీరంత ఇళ్లలోకి వస్తుందని కాలనీ వాసులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి లోతట్టు ప్రాంతంలో ఉన్న బిసి కాలనీ మురికి నీటి సమస్య తీర్చాలని కాలనీవాసులు కోరుతున్నారు.

సంబంధిత పోస్ట్