కామారెడ్డి మండలం చిన్నమల్లారెడ్డి గ్రామ శివారులో బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో పెళ్లికి వెళ్తున్న 8 మంది గాయపడ్డారు. రాజంపేట మండలం అరగొండ వాసి భరత్ వివాహం కోసం కుటుంబ సభ్యులు కారులో వెళ్తుండగా, వాహనం అదుపుతప్పి రోడ్డు పక్కన ఉన్న కల్వర్టును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారులో ఉన్న 8 మందికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించి, పోలీసులు కేసు నమోదు చేశారు.