అదుపుతప్పి కారు బోల్తా... ఒకరికి గాయాలు

గాంధారి మండలం పోతంగల్ కలాన్ వద్ద ఆదివారం కారు అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో కార్తీక్ అనే వ్యక్తి కాలు విరిగింది. సమాచారం అందిన వెంటనే 108 సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని, గాయపడిన వ్యక్తికి ప్రథమ చికిత్స అందించారు. అనంతరం ఈఆర్సీసీ మహేష్ సలహా మేరకు బాన్సువాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అంబులెన్స్ సిబ్బంది చురుకైన స్పందనను గ్రామస్తులు అభినందించారు.

సంబంధిత పోస్ట్