యువతి అదృశ్యం.. కేసు నమోదు

ఎల్లారెడ్డి మున్సిపల్ పరిధిలోని 1వ వార్డు ఎర్రమన్నుకుచ్చకు చెందిన కల్లెం పరిమళ (19) అనే యువతి అదృశ్యమైనట్లు ఆమె తల్లి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. ఆదివారం ఎస్ఐ బొజ్జ మహేష్ తెలిపిన వివరాల ప్రకారం, శనివారం సాయంత్రం కుటుంబ సభ్యులతో కలిసి కులదైవం లహరి కృష్ణ దేవాలయానికి వెళ్లిన పరిమళ, బయటకు వెళ్లి వస్తానని చెప్పి తిరిగి రాలేదు. దీంతో ఆమె తల్లి ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.

సంబంధిత పోస్ట్