రోగులకు పండ్ల పంపిణీ చేసిన చిన్నారులు

ఎల్లారెడ్డి పట్టణ కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు ఎల్లారెడ్డి న్యూ ఆబాది కాలనీ శ్రీ విఘ్నేశ్వర గణేష్ మండలి చిన్నారులు పండ్ల పంపిణీ చేశారు. చిన్నారులు గణేష్ మండలి ఏర్పాటు చేసుకొని వచ్చిన చందాలతో గణేష్ మండపాన్ని ఏర్పాటు చేసి 11 రోజులపాటు ప్రత్యేకంగా పూజలు నిర్వహించి. ఉత్సాహంగా గణేష్ నిమర్జనం చేసి మిగిలిన డబ్బులతో రోగులకు పండ్ల పంపిణీ చేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో శ్రీ విఘ్నేశ్వర గణేష్ మండలి చిన్నారులు లాస్య, రూప, అమ్ములు, శ్రీహిత, మణివీర, టిల్లు, కిట్టు, సహస్రక్షి తదితరులు ఉన్నారు.

సంబంధిత పోస్ట్

✕
✕